సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం రాజ్య సభ లో ప్రధాని మంత్రి నరేంద్రమోదీ అవాస్తవాలు మాట్లాడుతున్నారంటూ సభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. అయితే ఏపీకి చెందిన మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యుల బలం కల వైసీపీ మాత్రం సభలోనే ఉంది. ప్రతిపక్షాల వాకౌట్‌ మధ్య ప్రధాని మోదీ మాట్లాడుతూ.. విపక్ష సభ్యులు ఎగువ సభను అవమానిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షం సభను అవమానించిందని.. చర్చ నుంచి పారిపోవడమే ప్రతిపక్షాల విధి అంటూ విమర్శించారు.విపక్షాల వాకౌట్‌పై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షం తన తీరు మార్చుకోవడం లేదన్నారు. ఇవాళ ప్రతిపక్షాల వాకౌట్‌ను ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగం కంఠస్థం చేయాల్సిన పుస్తకం కాదని.. రాజ్యాంగం జీవించడానికి ఒక మార్గదర్శనం అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడటమంటే.. మొదట రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. రాజ్యాంగ విలువలు పాటించకుండా.. విపక్షాలు భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాయరు. విపక్షాలకు పోరాడే ధైర్యం లేదన్నారు. దేశం ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని తెలిపారు. ప్రతిపక్షాల ప్రయత్నాలన్నీ విఫలమవడంతో బయటకు వెళ్లిపోయారన్నారు. నేటి మధ్యాహ్నం ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగం పూర్తికాకపోవడంతో ఈరోజు లంచ్ అవర్‌‌ను క్యాన్సిల్ చేస్తున్నామని రాజ్యసభ ఛైర్మన్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *