సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 11 నెలల క్రితం జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరం కావడంతో తమ రాజకీయ భవితవ్యం కోసం, వ్యాపార అవసరాల కోసం వైసీపీలో కీలక నేతలు తమ పదవులకే కాకుండా.. పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామాలు చేసి షెల్టర్ కోసం కూటమిలో చేరుతున్న ఘటనలు చూస్తున్నాము.. ఈ నేపథ్యంలోనే ఏ పార్టీలోనూ చేరను .. వ్యవసాయం చేసుకొంటాను అంటూ వైసీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన ప్రధాని మోడీ, అమిత్ షా అస్సిసులతో బీజేపీ లో ? చేరతారు అన్న ఊహాగానాలు మస్తుగా ఉన్నాయి. అయితే మరో సరి బీజేపీ తరపున రాజ్యసభ వస్తారో లేక ఆయన జీవిత ఆశయం ‘గవర్నర్ పదవి’ సాధించడం కోసం ,మరోదారిలో వస్తారో తెలియదు.. ఇదిలా ఉండగా ఏపీలో విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి (2028 జూన్ వరకు మాత్రమే పదవీకాలం ఉంటుంది) ఉప ఎన్నిక కోసం నేడు, బుధవారం సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 22 నుండి 29 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక, ఫలితాలు వెలువడ తాయి. ఐతే మే 2వ తేదీనే కూటమి అభ్యర్థి ఏకపక్షంగా ఎన్నికయ్యే అవకాశం కనపడుతుంది.
