సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజ్యసభ సభ్యులు , బిజెపి క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు, భీమవరం కు చెందిన న్యాయవాది పాక వెంకట సత్యనారాయణ పార్లమెంటరీ కమిటీ వివిధ కమిటీల సభ్యులుగా మంగళవారం నియమితులయ్యారు. ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ కోసం సంప్రదింపుల కమిటీ సభ్యునిగా ఎంపీ పాక వెంకట సత్యనారాయణ నియమితు లయ్యారు .ఈ కమిటీతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం మరియు అడవుల స్టాండింగ్ కమిటీ సభ్యు సభ్యునిగా కూడా ఎంపీ పాక వెంకట సత్యనారాయణ ను నియమించడం ఆయనకు గౌరవం హోదా మరింత ఇనుమడింప చేసింది. భీమవరంలో రాజకీయాలకు అతీతంగా ఆయన శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
