సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం మీడియాతో మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ వాళ్ళకు ఏ ప్రభుత్వ పథకాలు ఇవ్వొద్దని స్వయంగా cm చంద్రబాబు ప్రకటిస్తున్నారన్నారు. ఈ మాట అనడానికి చంద్రబాబు ఎవరన్నారు. రాష్ట్రంలో ప్రజలందరి కోసం పక్షపాతానికి, రాగ ద్వేషాలకు అతీతంగా పని చేస్తానని భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసారని, ఇలాంటి వ్యక్తిని సీఎంగా ఒక్క నిమిషం కొనసాగించకూడదు అంటూ వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ లో చంద్రబాబు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై మాట్లాడే పరిస్థితి లేదని వైఎస్ జగన్ అన్నారు. నాణేనికి ఇంకో వైపు కూడా ప్రజలకు తెలియాలన్నారు. చంద్రబాబు,అతని దత్త పుత్రుడు కలసి ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్‌లలో అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేశారన్నారు. మొదటి బడ్జెట్ లో సంక్షేమ కేటాయింపులే కనపడ్డాయి తప్ప ఎవరికీ ఇచ్చింది లేదని అందరికి గుండు సున్నా మిగిలింది అన్నారు. బడ్జెట్‌లో ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం పేరుతో పచ్చి అబద్దాలు చెప్పారన్నారు. 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామనిని గవర్నర్ ప్రసంగంలో అబద్దాలు చెప్పించారన్నారు. తమ హయాంలో లక్షా 30 వేల ఉద్యోగాలు గ్రామ వార్డ్ సచివాలయంలో కల్పించామని ఆర్టీసీ లో 56 వేల మంది కలపి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాలు 6 లక్షల మందికి పైగా ఇచ్చామని ఆధార కార్డు ల నెంబర్లు తో సహా నిరూపించగలను 2019-24 కాలంలో ఎంఎస్‌ఎమ్ఈ ద్వారా ప్రవేటు సంస్థలతో కలపి 32 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇదే విషయం చంద్రబాబు తన సోషల్ ఏకనిమిక్ సర్వేలో స్వయంగా పేర్కొన్నారని అన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నాశం చేసారని ఉన్న ఉద్యోగాలే పోతున్నాయని, ఎన్నికల హామీలో ఇచ్చిన , ప్రెవేటు నిరుద్యోగులకు నెలవారీ భృతి, 3 వేలు ఇస్తామని ఇప్పటికి ఒక్క రూపాయి చెల్లించలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు హామీ నెరవేర్చలేదన్నారు. రైతులకు చంద్రబాబు మోసం చేయడం కొత్త కాదన్నారు. హామీలు ఇచ్చి అందరికి ఎగనామం పెట్టారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రకారం ఇవ్వవలసిన బకాయిలు అన్ని లెక్కకట్టి చెల్లించాలని డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *