సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరోసారి నేడు, శుక్రవారం మాజీ వైసీపీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి బెయిల్ లభించింది. పోసానికి గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైల్లో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. మరో కొత్త కేసు నమోదు కాకపోతే పోసాని విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే హైకోర్టు పలుమారులు బెయిల్ ఇవ్వడం.. అయితే వెంటనే పోసానిని మరో కొత్త కేసులో మరో ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ కు రిమాండ్ కు పంపడం గమనిస్తూనే ఉన్నారు..ఈ నేపథ్యంలో రాజ్య సభలో అందరి సభ్యులు ముందు వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర ఆవేదనతో డైరెక్ట్ అమిత్ షా నుద్దేశించి తన గళం పెంచారు. మాకు ప్రధాని మోడీ అంటే చాల గౌరవం ఉంది. అయితే అయితే ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్నా దాడులు, అక్రమ కేసులు మీకు తెలిసి కూడా చూసి చూడనట్లు ఎందుకు ఉంటున్నారు? రాజకీయాలలో రాజకీయ నేతలు పరస్పరం తిట్టుకోవడం దేశవ్యాప్తంగా జరుగుతుందని, తిట్టిన దానికి కేసు పెడతారని అంతే కానీ కక్ష కట్టి అక్రమ కేసులు ఎన్నో పెట్టి వేధించరని, ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నేతలను అక్రమ్ కేసులతో వేధిస్తోందని, ఇటీవల గతంలో తిట్టాడని సినీ నటుడు పోసాని కృష్ణ ను రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ అధికారులను ప్రేరేపించి కొత్త కేసులలో వేధిస్తూ రాష్ట్రము అంతటా త్రిప్పుతుందని, ఇలా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయని పట్టించుకోకపోతే అది కేంద్రానికి కూడా మచ్చగా మిగులుతుందని ఆయన కాస్త గట్టి స్వరం వినిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *