సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: గతంలో మెగా తనయుడు ‘రామ్ చరణ్ ‘ తో సుకుమార్ రంగస్థలం ఎంతటి సంచలన విజయం సాధించాడో అంతకు మించి అల్లు అర్జున్ – సుకుమార్ కాం బినేషన్లో తెరకెక్కి న చిత్రం ‘పుష్ప ’తో పాన్ ఇండియా సినిమా గా ఒక ఊపు ఊపాడు.. మరి చాలాకాలంగా ఎదురుచూస్తున్నా పుష్ప 2 ను అంతకు మించిన రేంజ్ లో రూపొందించాలని సుకుమార్ ఆలోచన.. మరి తన హీరోలు ఇద్దరు .. ఒకే తెరపై షేర్ చేసుకొంటే మరో త్రిబుల్ ఆర్ అంత హిట్ చెయ్యాలని భాస్తున్నారట.. ఇప్పటికే వీరిద్దరూ నటించిన ‘ఎవడు’ వచ్చి నప్ప టికీ అం దులో చరణ్-బన్నీ కలిసి కనిపించిన సన్నివేశాల్లేవు. తాజా సమాచారం ప్రకారం.. త్వ రలోనే వీరిద్దరూ వెండితెరపై కలిసి ‘పుష్ప ది రూల్’ సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో పుష్పరాజ్ ను గడగడలాడించే రామరాజు పోలీస్ పాత్రలో కొద్దీ నిముషాల పాటు కనిపించే ప్రత్యేక పాత్రలో రాంచరణ్ ను నటింపచేసేందుకు సుకుమార్ ఇప్పటికే సంప్రదింపులు జరిపారని,అతిత్వరలో అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని ఫిల్మ్ వర్గాల వార్త.. ఇటీవల చిరు.. అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగింది అని వస్తున్నా వార్తలకు దీనితో ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ఆలోచనట..
