సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం బ్రాండ్, ఆలిండియా డార్లింగ్ స్టార్ ,, ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ మూవీ 400 కోట్ల పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీని వచ్చే జనవరి 14న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా హిందీ, తెలుగు సాంగ్స్ వీడియో లు మ్యూజికల్ హిట్స్ గా యూట్యూబ్ లో దుమ్ము దులుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈవెంట్‌ను కూడా భారీ స్థాయిలో స్థాయిలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే డిసెంబర్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక భారీ ఎత్తున అభిమానులు, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో మూవీ ట్రైలర్‌ను కూడా విడుదల చేసే యోచనలో చిత్ర బృందం ఉందని టాక్. టీ-సిరీస్ ఫిల్మ్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా రాధాకృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా, సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
