సిగ్మాతెలుగు డాట్ ఇన్: భీమవరం బ్రాండ్,పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘రాధే శ్యామ్’. తాజాగా చిత్రబృందం గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన భారీ ప్రీ రిలీజ్ పంక్షన్ లో రెబల్ స్టార్ కృష్ణంరాజు చేతులమీదుగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. చేతిరేఖలు తో ఆ మనిషి జాతకం చెప్పగల విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ ఇప్పటికే ఎలివేట్ అయ్యాడు. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా మీద బజ్‌ను మరో స్థాయిలో పెంచేసింది. ఇదో ప్రేమ విషాద గాధ అని కూడా ఇంట్ ఇచ్చేసారు.అభిమానుల సందేహాలన్నిటిని ‘రాధే శ్యామ్’ ట్రైలర్ ఇట్టే తీర్చేసింది. ముఖ్యంగా ట్రైలర్‌లో ‘అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు.. నా చేతిలో ప్రేమ, పెళ్లి లేవు’ అని చెప్పడం, ‘నేను ప్రేమలో పడను.. అలాంటి ప్రేమ నా వల్ల కాదు.`పుట్టుక నుంచి చావు దాకా.. ఏ రోజు ఏమి జరుగుతుందో నాకు బాగా తెలుసు’ వంటి డైలాగులతో విక్రమాదిత్యగా నటించిన ప్రభాస్ పాత్ర స్వభావాన్ని తెలియజేసారు. ప్రేరణగా నటిస్తున్న పూజా హెగ్డే మెస్మరైజ్ చేసింది. మొత్తంగా ట్రైలర్‌కు మాత్రం ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు స్వామిజీ పరమహంస గా , జగపతి బాబు కీలకరోల్ లో నటిస్తున్నఈ సినిమావచ్చే నెల 14న 7 భాషలలో ప్రపంచవ్యాప్తంగా
