సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు నాట అగ్ర హీరో విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, నటించిన సంచలన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ మొదటి సిరీస్ పాన్ ఇండియా స్థాయిలో 2023లో నెట్‌ఫ్లిక్స్ ఓటిటి లో బ్రేక్అవుట్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్, ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందిందో అందరికి తెల్సిందే. మరి అతి త్వరలో రెండో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండో సీజన్‌ను మరింత ఉత్కంఠభరితంగా రూపొందించారు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ ,అభయ్ చోప్రా ల దర్శకత్వం వహిం చారు. ‘రానా నాయుడు సీజన్ 2’ జూన్ 13, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ప్రేక్షకులు సిద్దమేనా..
