సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చలి తీవ్రత పెరగడంతో పాటు దిగువస్థాయి నుంచి తూర్పు , ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఇవి మరికొద్ది రోజులు ఉంటాయి. వీటి ఫలితం గా రేపు సోమవారం నుండి రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లోఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉం దని భారత వాతావరణ విభాగం (ఐఎం డీ) ప్రకటించింది. అనంతరం పొడి వాతావరణం మొదలయ్యాక రాష్ట్రంలో చలి ప్రభావం మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా శనివారం తిరుపతి జిల్లా లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. రేపు సోమవారం నుండి.
