సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగా వారసుడు రామచరణ్ హీరోగా కొత్త సినిమా ‘పెద్ది’ షూటింగ్ నేడు, బుధవారం ఉదయం ఘనంగా. పూజా కార్యక్రమం లో చిరంజీవి, అల్లుఅరవింద్, బోనీకపూర్. అగ్ర దర్శకుడు శంకర్ , ఏ ఆర్ రెహమాన్ తో పాటు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం రాంచరణ్ అతిథులకు కృతజ్ఞతలు చెప్పారు. ఉప్పెన వంటి హిట్ ఇచ్చిన బుచ్చి బాబు రాసిన కథ తనకెంతో నచ్చిందన్నా రు. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని . స్పో ర్ట్స్ డ్రామాగా… గ్రామీణ నేపథ్యం లో రూపొందిస్తున్నామన్నారు. . హీరో రామచరణ్ ,జాన్వీ కపూర్ జంట గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీస్ నిర్మిస్తుండగా చాల కాలం తరువాత రెహమాన్ స్వ రాలు అందించనున్నా రు. ఈ సినిమాకు ‘పెద్ది’ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం .
