సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆకివీడు ఘర్షణలో గాయపడి భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గత శుక్రవారం రాత్రి భీమవరం హాస్పటల్ కు వెళ్లి పరామర్శించారు.​ డెప్యూటీ స్పీకర్ రఘురామా రామాలయం వద్ద కు వెళ్ళినపుడు జరిగిన దాడి లో గాయపడిన కూటమి నేతలు గవర అనిల్ కుమార్, వెజ్జు నాగ సాయిలను కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. ఇప్పటికే 55 మందిపై కేసులు నమోదు చేసి వారిలో 20 మందిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చెయ్యడం జరిగింది. నేడు, శనివారం మధ్యాహ్నం ఆకివీడులో విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పాల్గొని ఆకివీడు పెదపేట రామాలయం వద్ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. కొందరు మతం ముసుగులో ఎప్పటినుంచో ఉంటున్న రామాలయంలో శ్రీ రాములవారిని దర్శనం చేసుకోనివ్వం.. ఆలయం పునర్నిర్మాణము చెయ్యనివ్వం, అని అడ్డుకోవడం, ప్రజా ప్రజాప్రతినిధులను సైతం అడ్డుకోవడం ప్రజా స్వామ్యంలో చట్ట వ్యతిరేకమైనదని, మతం మారితే ఇక ఎస్ సి ఎస్టీ అట్రాసిటీ వర్తించదని ఇటీవల సుప్రీం కోర్ట్ తీర్పు కూడా ఇచ్చిందని దోషులు తప్పించుకోలేరని ఈ దాడికి పాల్బడిన వారిని చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుందని, రాజకీయాలకు తావు లేకుండా విశ్వా హిందూ పరిషత్తు ఆధ్వర్యంలో రామాలయాన్ని పునర్ నిర్మిస్తామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *