సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం వాళ్లకు తెలివితో పాటు వెటకారం ఎక్కువ ఉంటుందని నానుడి…మరి ‘శివ’ క్షణ క్షణం..కంపెనీ, సత్య, సర్కార్ 1,2, రక్త చరిత్రలతో భారతీయ సినిమాకు కొత్త ట్రెండ్ ను సెట్ చేసిన ఘనుడు రామ్ గోపాల్ వర్మ.. తదుపరి నెంబర్ వన్ పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిన తెలుగువాడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. దేశంలో ఎందరో అగ్ర దర్శకులకు రాచబాట వేసిన దర్శక గురువు.. మరి ఈ అపర మేధావి మరి ప్రస్తుతం కాలం కలిసిరాక పోయిన సరే.. ‘ఎదో వివాదం తో ఎప్పుడు పబ్లిసిటి లో పామ్’ లోనే ఉంటాడు.. గత ఎన్నికలకు ముందు సీఎం జగన్ కు మద్దతుగా ఆయన ప్రత్యర్థుల ఫై చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ల పై అనేక సెటైరికల్ సినిమాలు తీసి ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. మరి ప్రస్తుతం టైం తిరగబడింది. వర్మ ను వాళ్ళు వదలలేదు.. వరుస కేసులు పడుతున్నాయి. వర్మకు హైకోర్టు కూడా బెయిల్ నిరాకరించింది. అయితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేసులో ఒంగోలు లో నమోదు అయిన కేసులో నేడు, సోమవారం విచారణకు వర్మ హాజరు కావలసి ఉంది. మరి బుద్దిగా హాజరు అయితే అతను రామ్ గోపాల్ వర్మ ఎందుకు అవుతాడు? కారణం ఏదైనా ఆయన 2వ సారి పోలీసు విచారణకు డుమ్మాకొట్టారు. ఈరోజు (సోమవారం) విచారణకు హాజరుకావడం లేదంటూ లాయర్ ద్వారా పోలీసులకు వర్మ సమాచారం పంపారు. ఇక ఒంగోలు పోలీసులే నేడు, సోమవారం హైదరాబాద్ వెళ్లి వర్మ ఆఫీస్ వద్ద కు చేరుకొన్నారు. మరి వర్మ ను అరెస్ట్ చేస్తారా? లేక ఏమి జరగనుంది? తెలుగు ప్రజలు టీవీలలో ఆసక్తిగా గమనిస్తున్నారు.
