సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నో అవరోధాలు దాటుకొని వివాదాస్వాద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ‘ప్యూహం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏపీ రాజకీయ నేతలను అచ్చుగుద్దినట్లు ఉన్న అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్, ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితర నటీనటులతో రూపొందించిన ఈ సినిమా కధ అందరికి తెలిసిందే.. కధ చుస్తే.. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యే వరకు మొదటి భాగంగా ‘వ్యూహం’ రూపొందించారు. పాత్రలకు వర్మ తనదయిన పద్దతిలో పేర్లు పెట్టాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వీర శేఖర్ రెడ్డి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మదన్ రెడ్డి అనిపాత్రలను పరిచయం చేశారు. వై ఎస్ మరణానికి ముందు జగన్ అంటే ప్రజలకు పెద్దగా తెలియదు.. రాజకీయాల్లోఆయన తొలి అడుగు పడి కడప ఎంపీగా గెలుస్తారు. 2009లో హెలికాప్టర్ప్రమాదంలో వైఎస్సా ర్ మరణించడంతో ఏపీ కొత్త సీఎం గా మదన్(అజ్మల్ అమీర్) ముఖ్య మంత్రిగా కావాలని150కి పైగా ఎమ్మెల్యే ల మద్ధతుతో ఒక లేఖ భారత్ పార్టీ (కాంగ్రెస్) అధినేత్రి అయిన మేడం (సోనియా) వద్దకు చేరుతుంది.అదే సమయంలో మదన్ ముఖ్య మంత్రి ఎట్టిపరిస్థితిల్లోకాకూడదని ఇంద్రబాబు (ధనుంజయ్ ప్రభునే) పన్నిన వ్యూహం ఏంటి..? మేడం ను దిక్కరించిన జగన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు..? 2014లో ఇంద్రబాబుకు మద్దతు ఇచ్చిన శ్రవణ్ కళ్యాణ్..2019 ఎన్నికల్లోఆ పార్టీతో ఎందుకుపోటీ పెట్టుకోలేదు? మదన్ సీఎం కాకుండా శ్రవణ్ కల్యాణ్న్ ఇంద్రబాబు ఎలా వాడుకున్నాడు? ప్రతి పక్షాల కుట్రలన్నింటిని మదన్ ఎలా ప్రజా నాయకుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ. ప్రజలను మాత్రమే నమ్ము కుని ప్రజా నాయకుడిగా జగన్ ఎలా ఎదిగాడో, రాజకీయ చాణుక్యుడు గా చంద్రబాబు ఎత్తులు ఏమిటో? రాజకీయాలు తెలియని పవన్ ను ఎలా వాడుకొన్నారో.. కష్ట సమయంలో వైఎస్ జగన్ కి ఆయన తల్లి, సతీమణి అండగా ఎలా నిలడ్డారనే పాయింట్( చెల్లి షర్మిల పాత్ర లేదు) కోణంలో చక్కగా చూపించాడు. ఇటీవల కాలం వచ్చిన వర్మ సినిమాలలో ఇదే కాస్త రిచ్ గా కాస్త మనస్సు పెట్టి తీసిన సినిమాగా కనపడుతుంది. చంద్రబాబు సోనియా పాత్ర దారులు బాగా నటించారు. పవన్ తరహా పాత్ర తో లోకేష్ పాత్ర దారి తో ఫన్నీ సన్నివేశాలు తీసి వారిపై వర్మ తన స్వంత ఆనందం తీర్చుకోనట్లు ఉంది. ఏది ఏమైనా వైసిపి వారి కోసమే తెలిసిన కథతో మంచి కెమెరా పనితనంతో వర్మ తన వంతు విజయం సాధించాడు. కలెక్షన్స్ విషయం తెలియదు.. ఎలానూ ఓటిటి లో ..
