సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఆంధ్ర ప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి వారి పారువేట ఉత్సవం ఊరేగింపుపై మతోన్మాద శక్తులు హిందూ భక్తులపై చేసిన దాడికి పాల్బడ్డారని నిందితులపై చర్యలకు కూటమి ప్రభుత్వం ఉపకమించడం లేదని, పైగా హిందూ భక్తులనే అరెస్ట్ చేసారని దానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో విశ్వహిందూ పరిషత్తు పిలుపు మేరకు ధర్నాలు, నిరసన ర్యాలీలు జరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కూడా స్థానిక కేశవరావు హైస్కూల్ నుండి విశ్వహిందూ పరిషత్తు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. వబిలిశెట్టి వెంకటేశ్వర రావు తదితర నేతలు మాట్లాడుతూ.. రాయచోటి వీరభద్రస్వామి వారి ఊరేగింపులో పాల్గొన్న మహిళలపై,వృద్ధులపై,భక్తులపై పోలీస్ లాఠీచార్జి చేయించి అనేకమందిని గాయపరిచటమే కాక ఆర్ ఎస్ ఎస్ మరియు విశ్వ హిందూ పరిషత్ లపై మరియు ఊరేగింపులో పాల్గొన్న అనేకమందిపై కేసులు పెట్టిన రాయచోటి రూరల్ ఎస్ ఐ జె.నరశింహారెడ్డి గారిని సంస్పెడ్ చేసి హిందువులపై పెట్టిన అక్రమ కేసులును కూటమి ప్రభుత్వం వెంటనే తొలగించాలని డిమాండ్ చేయటం జరిగింది. దీనిపై సీఎం చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్వాదించాలని విన్నతి పత్రాలు పంపామన్నారు.
