సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు ప్రమాదాల బారి పడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న(శుక్రవారం) రాత్రి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో.. రాయచోటి పట్టణంలో కురిసిన భారీ వర్షం స్థానిక ప్రజల్లో తీవ్ర విషాదం నింపింది. నిన్న(శుక్రవారం) రాత్రి కురుసిన భారీ వర్షానికి ఎస్ఎన్ కాలనీ అంగన్‌వాడీ వెనుక ఉన్న డ్రైనేజీ కాలువ వరద నీటితో ఉధృతంగా ప్రవహించింది. ఈ వరద నీటిలో ఓ తల్లి, ఇద్దరు చిక్కుక పోయారు. అది చూసిన ఓ 28 సంవత్సరాల యువకుడు వారిని కాపాడపోయి.. తానూ వరదలో చిక్కుకున్నాడు. దీంతో నలుగురు భారీ వరద ధాటికి నీటిలో కొట్టుకుపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నీటి నుంచి బయటకు తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
