సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి శివార్లలో సరిహద్దు గ్రామం రాయలం అభివృద్ధి లో రాష్ట్రానికే ఆదర్శం..ఆయితే.. భీమవరం మండలంలోని రాయలం పంచాయతీకి గతంలో కేటాయించిన నిధులలో అవినీతి జరిగిందని నిర్ధారిస్తూ నిధుల దుర్వినియోగానికి కారకులయిన గత హయాంలో వరుసగా పనిచేసిన కార్యదర్శులు ఎస్కేజీ కృష్ణంరాజు(కిశోర్), జయరాజ్, పద్మావతిలను సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ తాజగా ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాదు వారికీ నోటీసులు కూడా అందజేసినట్లు సమాచరం. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి కి తెలియపరిచారు. సస్పెన్షన్ కు గురి అయిన కార్యదర్శి ,కృ ష్ణంరాజు దాదాపు రూ.2 కోట్లను తన సొంత బ్యాంకు ఖాతాకు మళ్లించుకున్నట్లు విచారణలో తేలింది. అతడి తర్వాత ఇక్కడ పని చేసిన జయరాజు రూ.14,94,224 నిధులు మళ్లించినట్లు నిర్ధారించారు. వీరిద్దరికి ముందు పనిచేసిన కార్యదర్శి పద్మావతి హయాం లోనూ చేసిన పనులకు నిధుల లెక్కలు సరిపోకపోవడం తో ఆమెను కూడా సస్పెండ్ చేశారు. రాయలంలో గతంలో పనిచేసిన ముగ్గురు కార్యదర్శులు ఒకేసారి సస్పెం డ్ కావడం సంచలనంగా మారింది.
