సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, సోమవారం భీమవరం మండలం రాయలం గ్రామంలో ముందుగా షిర్డీ సాయి బాబా ను దర్శించుకొని తదుపరి పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ముందుగా సాయిబాబా ఆలయం రోడ్ లో 65 లక్షల 30 వేల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేసిన సిమెంట్ రోడ్ ను ప్రారంభించారు. అనంతరం 45 లక్షల 70 వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించే దిశలో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకు అధికారులను మరింత అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత దేశంలో మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందని అన్నారు. ప్రజలకు ప్రభుత్వం ద్వారా ఏ అవసరం ఏర్పడినా మండల కేంద్రాలకు వెళ్లకుండా వాలంటీర్లు సహకారంతో ప్రజలకు సమీపంలోనే సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ప్రతి గ్రామంలో కూడా సిసి రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని అన్నారు. రాయలం లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు అక్కడి ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి ఆ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అదే మాదిరిగా అక్కడి ప్రజల కోరిక మేరకు మూడు సిసి రోడ్లను మంజూరు చేశారు
