సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శివారు రాయలం గ్రామంలో నేడు, మంగళవారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రూ 14 లక్షల 40 వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన అంగనవాడి బిల్డింగును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాలతో గత 4 ఏళ్లుగా గతంలో ఎన్నడూ లేనివిధంగా చిన్నారులకు చదువుతో పాటు , గర్భిణీలకు, బాలింతలకు బలమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ సొంత భవనాలలో ఏర్పాటు చేస్తున్నామని,న్నారు. ప్రతి కుటుంబానికి కూడా సీఎం జగన్ పెద్ద కొడుకు మాదిరిగా, పిల్లలకు మేనమామగా బాధ్యత తీసుకుని స్వర్ణపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. తదుపరి, రాయలం గ్రామంలో 41 లక్షల రూపాయలతో నిర్మించిన ఇంటర్నల్ సిసి రోడ్లను ఎమ్మెల్యే గ్రంధి శీనివాస్ ప్రారంభించారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా సిసి రోడ్ల నిర్మాణానికి, డ్రైనేజీల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తున్నామని అన్నారు. ముందుగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వెంకట నరసింహరాజు తో పాటు గ్రామానికి చెందిన వైసిపి నేతలు చినమిల్లి శ్రీనివాస్, చిన మిల్లి నాగన్న, చినమిల్లి వెంకటరాయుడు, చెల్లబోయిన బుజ్జి,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *