సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం శివారులో రాయలం గ్రామం సరిహద్దులో రాయలం డ్రైయిన్ ఫై ఆక్రమణలు ఫై వస్తున్నా వార్తల నేపథ్యంలో.. పట్టణ ప్రత్యేక అధికారి మరియు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు స్థానిక మున్సిపల్అధికారులు గత 2 రోజులుగా రాయలం డ్రైన్ ఫై ఉన్న ఆక్రమణలు గుర్తించి మార్కింగ్ చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ టి.సుధాకర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ గౌరు, టౌన్ సర్వే యర్ రమబాయ్ డ్రెయిన్ను పరిశీలిం చారు. డ్రైన్ ఫై ఆక్రమణలు కు సంబంధించి మ్యాప్ స్కేచ్ సిద్ధం చేస్తున్నామని తదుపరి ఆక్రమణల ను నిర్ధారించి తొలగింపునకు చర్యలు తీసుకొంటామని మునిసిపల్ కమిషనర్ తెలిపారు.
