సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో వాడవాడలా దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు, మంగళవారం భీమవరం మండలం రాయలం గ్రామంలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో 3వ వార్షిక శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పాల్గొని నిలువెత్తు శ్రీ అమ్మవారిని దర్శించుకొన్నారు. తదుపరి అక్కడ భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. మహా నివేదనకు హారతులు ఇచ్చారు. వందలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. అన్నిదానాలకెల్ల అన్నదానం ఎంతో గొప్పదని, దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధనలు భగవంతుడు మెచ్చే కార్యక్రమమని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ అధ్యక్షులు కోళ్ల రామచంద్రరావు, యూత్ సభ్యులు రామదుర్గ, పవన్, కేశవ, నందు, గౌతమ్, సాయి, భక్తులు పాల్గొన్నారు
