సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతం నుండి తెలంగాణలోని కృష్ణ తదితర నీటి జలాలను గత కెసిఆర్ ప్రభుత్వం తో అప్పటి జగన్ సర్కార్ కుమ్మక్కు అయ్యి రాయలసీమ వాసులకు లబ్ది కోసం అక్రమంగా భారీ నీటిని తరలించిందిదాని, ప్రాజెక్టు లు నిర్మిస్తుందని, వాటిని తాను అధికారంలోకి రాగానే అక్కడి చంద్రబాబు సర్కర్ సహకారంతో వెంటనే నిలిపివేశామని సంచలన ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో.. మాజీ సీఎం జగన్ నేడు, గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాను రాయలసీమకు ద్రోహం చేసానని రాయలసీమ ఎత్తిపోతల ను నేనే ఆపేసానని చంద్రబాబు సర్కార్ వారి మీడియా సహకారంతో ఇటీవల చేస్తున్న దుష్ప్రచారం ఎంత మోసపూరితమో ప్రజలకు పూర్తిగా అర్ధం అయ్యిందని, రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ వ్యాఖ్యలే సాక్ష్యం. తెలంగాణ సీఎం రేవంత్‌‌రెడ్డితో చంద్రబాబు రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేశారు. ఎవరు రాయలసీమ కు ద్రోహం చేస్తున్నారో ప్రజలకు కళ్ళకు కట్టినట్లు అర్ధం అయ్యిందన్నారు. నా ప్రభుత్వ హయాంలో కోరల్లో చిక్కుకున్న ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనుకున్నామని అన్నారు. రాయలసీమకు తాము తలపెట్టిన ఎత్తిపోతల.. సంజీవని లాంటిదని అయితే ఆ పధకాలను ప్రాజెక్టులను ఎవరి మెప్పు కోసమో చంద్రబాబు ఆపివేశారని, నెల్లూరు, రాయలసీమ ప్రజలు చంద్రబాబును విలన్‌లా చూస్తున్నారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *