సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కడప జిల్లాలో నేడు, శుక్రవారం సాయంత్రం తెలుగు పార్టీ ‘రా.. కదలిరా..’ భారీ బహిరంగ సభ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై రాయలసీమ వైసిపి ఎమ్మెల్యేలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇక్కడ కమలాపురం ఎమ్మెల్యే పెద్ద అవినీతి చక్రవర్తి అని ఏకంగా రూ.20 వేల కోట్ల విలువైన 9 వేల ఎకరాల భూమికి టెండర్ పెట్టారు. సర్వారాయ ప్రాజెక్ట్‌ దగ్గర 400 ఎకరాలు ఆక్రమించారని ఆరోపణలు చేసారు. జగన్ అధికారంలోకి వచ్చేక పులివెందులలో ఇసుక, మట్టి దోపిడీ చేస్తున్నారు గ్రానైట్ పరిశ్రమ యజమానులు పన్నులు ఎగవేస్తున్నారు. కల్లూరులో భూములను తన వెంచర్‌లో కలుపుకున్నారు. చింతకుంటలో 80 ఎకరాలను మైదుకూరు ఎమ్మెల్యే కొల్లగట్టారు అని ఆరోపించారు. ప్రజలకు సంబందించిన ఆస్తులు పత్రాలపై కూడా సీఎం జగన్ బొమ్మలు ఎందుకు ముద్రించాలని ప్రశ్నించారు. ప్రజలు వచ్చే ఎన్నికలల్లో టీడీపీ జనసేన కూటమి కి పట్టం కట్టాలని .. జగన్ ప్రభుత్వానికి భయపడి మాకు ఓట్లు వెయ్యకపోతే ఆ భయమే మిమ్మల్ని చంపేస్తుంది. జగన్ మాటలు కోటలు దాటాయి.. కానీ చేతలు మాత్రం గడప కూడా దాటలేదు అని చంద్రబాబు విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *