సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చెన్నై మింట్ పీఎస్ పరిధిలో కూవం నదిలో మూడు రోజుల క్రితం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. మృతుడి చేతి మీద జనసేన సింబల్‌తో పాటు వినుత పేరు ఉండడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో ఈ నెల 8వ తేదీన రాయడిని హత్య చేసి నదీలో పడేసినట్లుగా తెలుస్తోంది. అయితే నమ్మినబంటుగా ఉన్న రాయుడు చేసిన ద్రోహానికి అతన్ని జనసేన పార్టీ నుండి తొలిగిస్తున్నట్లుగా జూన్ 21వ తేదీన శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి వినుత కోటా, బహిరంగగా ప్రకటన చేశారు. ఇప్పుడు రాయుడు హత్యకు గురికావడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. తాజగా శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో ఐదుగురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబుతో పాటుగా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. మృతుడు రాయుడు గతంలో వినుత వద్ద కారు డ్రైవర్ మరియు పిఎ గా కూడా పనిచెయ్యడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *