సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ ఏ కన్వెన్షన్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు గత గురువారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు లో స్వయంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని తమలోని కళ లను వేదికపై ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, తదితరులు హాజరయ్యారు. క్రీడా, సాంస్కృతిక పోటీల విజేతలకు బహుమతులను ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేయనున్నారు. అయితే ఈ ప్రదర్శనలలో హైలైట్ గా నిలచింది అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు దుర్యోధన సార్వభౌముని గెటప్ లో వేదికపైకి వచ్చి 10 నిమిషాలపాటు దానవీర సూరకర్ణ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్స్ ‘ఏమంటివి ఏమంటివి అంటూ.. కులము కులము అంటూ వితండవాదం ఎలా? అంటూ సుదీర్ఘ డెలాగ్స్ చెప్పి ఏకాపాత్రాభినయం చేశారు. రఘురామకృష్ణంరాజు డైలాగ్స్‌కు ముఖ్యమంత్రి, చంద్రబాబు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నవ్వులతో తమ హర్షాన్ని ప్రకటించి అభినందలు తెలిపారు. సభలోని సభ్యులంతా చప్పట్లు కొట్టారు. కేరింతలతో ప్రాంగణం మార్మోగింది.వేదికపై గత అనుభవం లేకున్నా ప్రతిభ చూపిన రఘురామా కు త్వరలో సినిమాలలో కూడా కీలక పాత్రలలో కూడా నటించే అవకాశం వస్తుందని భావించవచ్చు..
