సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ దర్శకులలో సైలెంట్ గా వచ్చి బడ్జెట్ సినిమాలలో మినిమమ్ గ్యారెంటీరి హిట్ సినిమా లు కొట్టే దర్శకుడుగా నక్కిన త్రినాధరావు కు మంచి పేరు ఉంది.. సినిమా చూపిసా మామ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే, ధమాకా’ లాంటి హిట్ సినిమాల తర్వాత త్రినాధరావు, దర్శకత్వంలో రావు రమేష్ ప్రధాన పాత్రలో సందీప్ కిషన్ వంటి చోటా హీరోతో “మజాకా”సినిమా మహా శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందు కు వచ్చింది. మరి ఈసారి కూడా త్రినాధరావు హిట్ కొట్టాడా చుస్తే.. ముందుగా ఈ సినిమా కథ:వెంకటరమణ (రావు రమేష్) కొడుకు కృష్ణ (సందీప్ కిషన్) పుట్టగానే భార్య ను కోల్పోతాడు.ఎంతో గారాబంగా కొడుకుని పెంచి పెద్ద చేస్తాడు. ఆడ దిక్కు లేని సంసారం కదా..? ఇద్దరు మగవాళ్ళు ఉన్న ఇంటికి పిల్లనిచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. అందుకే ముందు తానే ఇంకో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు రమణ. ఈ క్రమంలోనే యశోద (మన్మధుడు హీరోయిన్ అన్షు )ని చూసి ప్రేమలో పడతాడు. అదే సమయంలో తన కాలేజీలోనే చదివే మీరా (రీతూ వర్మ)తో ప్రేమలో పడతాడు కృష్ణ. సరిగ్గా ఇదే సమయంలో ఈ తండ్రి కొడుకుల జీవితంలోకి వస్తాడు బిజినెస్ మాన్ భార్గవ్ వర్మ (మురళీ కృష్ణ). వాళ్ళిద్దరు పెళ్లి జరగాలంటే తాను చెప్పిన కండిషన్ కు ఒప్పుకోవాలి అంటాడు భార్గవ వర్మ. అసలు ఈ తండ్రి కొడుకులకు ఉన్న లింక్ ఏమిటన్నది అనేది మిగిలిన కథ.. ఇక సినిమాలో కాస్త ఇబ్బందిగా ఉన్న సరే రావు రమేష్ యూత్ తో పోటీ పడుతూ కస్టపడి ఓకే అనిపించారు. సందీప్ , నటీనటులు అందరు కూడా పర్వాలేదు.. అయితే ప్రేక్షకులకు ముందే సన్నివేశాలు తెలసిపోయే రొటీన్ సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ తండ్రి కొడుకుల లవ్ సీన్స్ తో కామెడీగా బాగానే ఉంది. .సెకండ్ హాఫ్ కాస్త ఇబ్బంది పెడుతుంది. దానికి తోడు హైపర్ ఆది జబర్దస్త్ జోకులు అంతగా పేలలేదు. ఒకటే సీన్ ఇటు తండ్రితో.. పాటు కొడుకుతో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుంటారు. పాటలు సంగీతం సో సో.. మొత్తానికి టైం పాస్ సినిమా అంతే ..
