సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగాఇంకా పలు బూత్ లలో ఓటింగ్ కొనసాగుతుంది. పిఠాపురం లో రాత్రి 1గంట వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా లో ఇప్పటికే ఓటింగ్ రికార్డు స్థాయిలో 80 శాతం దాటేసినట్లు తెలుస్తుంది. ముఖ్యముగా అతి పెద్ద నియోజకవర్గం భీమవరంలో ఇంకా అనేక పోలింగ్ బూత్ లలో రాత్రి 9 గంటలకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. భారీగా క్యూ లైన్లలో ఓటర్లు బారులు తిరి ఉన్నారు. ముఖ్యము గా పట్టణంలోని లూథరన్ హైస్కూల్ రెస్ట్ హౌస్ ప్రాంతాలలో, శ్రీ రామ పురం, రాయలం ప్రాంతాలలో భీమవరం మండలం లోని పలు గ్రామాలలో పోలింగ్ కొనసాగుతున్నట్లు సమాచారం. పరిస్థితులు స్వయంగా పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు రాత్రి 11 -12 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకొన్నారు. భీమవరంలో పలు కేంద్రాలలో ఈవీఎం మిషన్ లు చాల స్లో గా పనిచెయ్యడం కూడా ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఓటింగ్ శాతం పెరిగింది కాబ్బటి ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికీ వారే తమ గెలుపు ఫై ఉహాగానాలలో ఉన్నారు. అయితే భీమవరం గ్రామా ప్రాంతాలలో పెరిగిన ఓటింగ్ మహిళలు దాదాపు 90 శాతం వరకు ఓట్లు వేశారని భావిస్తున్న నేపథ్యంలో మైనారిటీలు కనివిని ఎరుగని రీతిలో ఓకే లక్ష్యంతో ఉదయం 6 గంటల నుండే పోలింగ్ కేంద్రాలలో నిలబడి ఓట్లు వెయ్యడం తమ విజయ సంకేతంగా తమకు తిరుగులేదని ఒక ప్రధాన పార్టీ భావిస్తుంది. అసెంబ్లీ, పార్లమెంట్ లకు క్రాస్ ఓటింగ్ జరిగిందని భావిస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున ఓటింగ్ జరగటం తో అది ఒకే పార్టీ అభ్యర్ధికి అనుకూలం అన్న వాదన కూడా వినపడుతుంది.రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే భావన కనపడుతుంది. ఏది ఏమైనా ప్రశాంతంగా పోలింగ్ ముగుస్తుండటం ఎంత ఆలస్యం అయిన ప్రజలు అధికారులు సహకరించడం ప్రజాస్వామ్యంలో పెద్ద విజయంగా భావించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *