సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో వారాహి విజయ భేరి బహిరంగ సభ ప్రాంగణానికినేటి సోమవారం రాత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. నేటి సాయంత్రం పిఠాపురం నుండి హెలికాఫ్టర్ లో బయలు దేరిన పవన్ గణపవరంలో మహాలక్ష్మి థియేటర్ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో హెలి ప్యాడ్. లో దిగారు. ఆయనకు స్థానిక నేతలతో పాటు ఉమ్మడి జిల్లా జనసేన అడ్జక్షులు చినబాబు స్వగతం పలికారు. అక్కడ నుంచి వారాహి వాహనంపై బొబ్బిలి వంతెన మీదుగా సెంటర్‌కు చేరుకుని బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా , భారీగా చేరుకొన్న కార్యకర్తలు, అభిమానులు మధ్య జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పత్స మట్ల ధర్మరాజు, మరియు ఏలూరు ఎంపీ అభ్యర్థి మహేష్ కుమార్ యాదవ్ ను సభకు పరిచయం చేసి వారిని కూటమి పార్టీల క్యాడర్ తో పాటు ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని పిలుపు నిచ్చారు. ఇక్కడ ఆక్వా రైతులకు తీవ్ర అన్నాయం జరుగుతుంది. రొయ్యల రేటు కూడా పడిపోయింది. మరోప్రక్క ప్రభుత్వ నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోతున్నారు.మరి కొద్దీ రోజులలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రావడం ఖాయంగా కనిపిస్తుందని, జగన్ పాలన కు వీడ్కోలు పలుకుదామని అభిమానులకు పిలుపునిచ్చారు. రేపు 30వ తేదీన పవన్ కళ్యాణ్ ఇక్కడ కు సమీపంలోని కొయ్యలగూడెంలో పర్యటించనున్నట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు.
