సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ప్రకాశం చౌక్ లోని శ్రీ అల్లూరి సీతారామ రాజు విగ్రహం వద్ద నేడు, శుక్రవారం ఉదయం నుండి స్థానిక వైసీపీ నేతలు, ప్రముఖ లాయర్, పలుమారులు కౌన్సిలర్ గా పనిచేసిన వైసీపీ నేత, రాయప్రోలు శ్రీనివాస్ మూర్తి ఆధ్వర్యంలో ధర్నా, నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ అంటూ దొంగ హామీలు ఇచ్చి వాటిని అమలు చెయ్యలేక అవస్థలు పడుతున్న కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక.. ఉచిత ఇసుక పేరుతొ గతంలో ఎప్పుడు లేనంత భారీ ధరలకు అమ్ముకుంటూ కోట్ల రూపాయల అవినీతి దందా మొదలు పెట్టేశారని..వీటిపై ఏపీ ప్రజల దృష్టిని మరలించడానికి గత 50 రోజులు పైగా రాష్ట్రంలో ఎక్కడ చుసిన టీడీపీ నేతలు తమకు ఓటు వెయ్యని ఓటర్లు ఫై వైసీపీ నేతల ఫై తీవ్ర స్థాయిలో నడి రోడ్లపై చేస్తున్న దాడులు, భయానక హత్యలు, ఆస్తుల విద్వంసాలు చేస్తున్నారని ప్రజాస్వామయం ను ఖునీ చేస్తున్నారని దీనిపై ఫై తమ నిరసన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని అన్నారు. తమ పార్టీ అధినేత జగన్ ఢిల్లీ లో చేప్పట్టిన ధర్నా కి సంఘీభావంగా దేశం అంతటా ఏపీలో జరుగుతున్నా దాష్టికాలపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ వైసీపీ నేతలు మాజీ కౌన్సెలర్స్ పాల్గొన్నారు.
