సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల భీమవరం పర్యటన ముగించుకొని గుంటూరు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అడ్జక్షుడు సోము వీర్రాజు నేడు, మంగళవారం మీడియా తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా గోతులమయం అని , అసలు రాష్ట్రంలో రోడ్లను బాగు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, వాహనదారులు చాల ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురి అవుతున్న జగన్ సర్కార్ పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. . రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లు, గ్రామ సచివాలయ భవనాలు అన్నీ కేంద్ర నిధులతో కట్టినవే అని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ వీటన్నింటికి తన స్టిక్కర్ వేసుకున్నారని ఆరోపించారు. కుటుంబ పార్టీల పాలనలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అబద్ధాలు రాజ్యమేలుతున్నాయన్నారు. కుటుంబ పార్టీలు బలోపేతం కావడానికి రాష్ట్రాన్ని బలహీనం చేస్తున్నాయని విమర్శించారు. నెల్లూరు జిల్లా గూడూరులో సిలికా కోసం రైతుల భూములు వారి అనుమతి లేకుండానే బలవంతంగా దున్నుతున్నారని సోమువీర్రాజు ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *