సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: గత రాత్రి వారాహి యాత్రలో..ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ పాలన అంతం చెయ్యవలసిన సమయం వచ్చిందని.. జగన్ సర్కార్ కు ప్రజలు ఎదురు తిరగాలని కోరుకొంటునాన్ని,ముఖ్యమంత్రిగా జగన్ ను ఇక గౌరవించి మాట్లాడానని ..సీఎం జగన్ పాలనపై కేంద్ర నిఘా సంస్థ ‘కాగ్ ‘ నిర్ధారించిన తప్పులపై ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేసారు. పవన్ ఏమన్నారంటే… “వాలంటీర్లు ప్రతి గ్రామంలో ఎవరు ఏ పార్టీ మనిషి? ఏ కుటుంబంలో ఎంత మంది ఉన్నా రు? ఒంటరి మహిళలు, వితంతువులు ఉన్నారా లేదా? ప్రధానంగా ఒంటరి మహిళలే లక్ష్యం గా వివరాల్ని సేకరించి సంఘ విద్రోహ శక్తులకి చేరవేస్తున్నరు. దానివల్లే 30వేల మంది మిస్సింగ్ కేసులు వచ్చాయని వారిలో ఇంకా 18వేలు దొరకలేదని ఇది తనకు కేంద్రంలోని నిఘ్ సంస్థల ప్రముఖులు తెలిపారన్నారు. వాలంటీర్లు హ్యూ మన్ ట్రాఫికింగ్‌కి పాల్పడుతున్నారు” అని తీవ్రస్థాయిలో ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *