సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జిల్లాల సంఖ్యా 26 గా విభజించిన నేపథ్యంలో అది మరింత విస్తరించి 32 జిల్లాలుగా? మార్చడానికి కూటమి ప్రభుత్వం పునరాలోచిస్తుంది. దానిలో భాగంగా చంద్రబాబు సర్కార్ జిల్లాల పునర్విభజన కోసం గతంలో ఏడుగురు మంత్రులతో కూడిన ఓ ప్రత్యేక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాని రిపోర్ట్స్ ఆధారంగా నేడు, మంగళవారం తొలిసారి ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనపై క్యాబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు.. అయితే అధికారికంగా నిర్ణయాలు ఇంకా బయటకు ప్రకటించలేదు. అమరావతి ని ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తారని తెలుస్తుంది. ఈ సమావేశంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ సబ్ డివిజన్లపై నిర్ణయం తీసుకొన్నారని భావిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం రాష్ట్రంలో మొంథా తుఫాన్ పరిస్థితిపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
