సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు నేడు, మంగళవారం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు చట్టం అయ్యింది. ఇప్పటికే సంచలన రీతిలో లోక్ సభ, ఇటు రాజ్యసభలలో కూడా ఆమోదం పొందిన ఈ సవరణ బిల్లుకు నేడు, రాష్ట్రపతి ఆమోదం తెలిపారని న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.గతంలో ఉన్నవక్ఫ్ బోర్డు చట్టం1995లో సవరించినది. కొత్తగా తీసుకువచ్చిన చట్టం ప్రకారం.. ఎవరైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం ఐదేళ్లు ఇస్లాం ఆచరించి ఉండాలి. ఆస్తి అతనికి మాత్రమే సొంతమై ఉండాలి. సవరణ చట్టంలో ‘వక్ఫ్ బై యూజర్’ నిబంధన తొలగించారు. వక్ఫ్ భూముల సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుంచి స్థానిక కలెక్టర్స్ కు బదిలీ చేశారు. వక్ఫ్ ఆస్తుల వివరాలు ఆరు నెలల్లో కేంద్రీయ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు స్త్రీలతో పాటు ఇద్దరు ముస్లిమేతర సభ్యులను సైతం చేర్చాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ నిర్ణయా మాత్రమే అంతిమం కాదు. 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇకపై వక్ఫ్ బోర్డులకు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించే అధికారం లేదు.
