సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకప్పుడు బెల్లపు ఊటలతో నాటు తయారీ కి ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలో కాలక్రమంలో సారాబట్టీలు కనుమరుగు అయ్యాయి. (పేద ప్రజలు కూలీలు సారా బదులు కాస్త ఖరీదయిన లిక్కర్ కు అలవాటు పడ్డారు) ఈ ఏడాది రాష్ట్రము లో పూర్తీ సారా రహిత జిల్లాగా పశ్చిమ గోదావరి ఎంపికయింది అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హర్షం ప్రకటించారు. భీమవరంలని కలెక్టరేట్‌లో జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నవోదయం 2.0 కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సారా తయారీని పూర్తిగా నిర్మూలించినట్లు తెలిపారు. తయారీ, విక్రయదారులకు ప్రత్యామ్నాయ ఉపాధికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థద్వారా స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాలను సమకూర్చినట్టు.. జిల్లాలో సారా తయారీ, విక్రయాలను పూర్తిగా నిర్మూలించే దిశగా 13 మందిని గుర్తించి ఒక్కొక్కరికి రూ.1లక్ష చొప్పున చెక్కులను అందజేశామన్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ సారా తయారీ, విక్రయాలు కొనసాగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, రూ.లక్ష పూచీకత్తుతో బైండోవర్ చేస్తామని తర్వాత ఏడాదిపాటు బెయిల్ రాకుండా పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. జిల్లాలో ఎక్కడైనా నాటు సారా తయారీ, అమ్మకాలు జరిపినా 14405 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు.
