సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఖురానిక్ స్టడీస్ సంస్థ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాల నుండి ప్రతి ఏటా రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ కేంద్రంగా ఖుర్ఆన్ కంఠస్థ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఖుర్ఆన్ కంఠస్థ పోటీలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా నిర్వాహకులు ముహమ్మద్ సిద్దీఖ్ గారు ఒక ప్రకటనలో తెలియజేసారు.విజేతలకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేయబడతాయి. మొదటి బహుమతి రూ.20,000/-, ద్వితీయ బహుమతి రూ.15,000/- మరియు తృతీయ బహుమతి రూ.10,000/- గా నిర్ణయించడం జరిగింది. . ఈరోజు గురువారం భీమవరం పట్టణంలోని స్థానిక ఇఖ్రా మదరసా నందు పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.వివరాలకు భీమవరం, జమాతే ఇస్లామీ హింద్ , phone: 98486 77137 ను సంప్రదించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *