సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను 8వేల ఓట్ల పైగా ఓడించిన లోకల్ మాస్ రియల్ హీరోగా తెలుగు రాష్ట్రాల లో మంచి గుర్తింపు ఉన్నపటికీ ఎందుచేతనో అనేక ఊహాగానాలు జరిగినప్పటికీ మంత్రి పదవి గాని, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్ పదవి లాంటి సముచిత స్థానాలు దక్కలేదు. అయితే ఇక ఎన్నికలు కు మరో 6 నెలలు సమయం ఉండగా మాత్రం రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మెన్ పదవితో పాటు శాసన సభలో ప్రభుత్వ విప్ పదవీ కూడా ఇచ్చి జగన్ సర్కార్ ఆయనను గౌరవించింది. దానితో ఆయనను పలువురు ప్రముఖులు కార్యాలయానికి వచ్చి అభినందనలు తెలిపారు. మన సిగ్మా న్యూస్ కూడా ఆయనకు అభినందనలు తెలుపుతుంది. నేడు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనమాట ను గౌరవించి జిల్లా కేంద్రం,మన ప్రాంత ప్రజా అభివృద్ధి కి అనేక నిధులు మంజూరు చేసిన సీఎం జగన్ తనకు సముచిత స్థానం కలిగిన పదవులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నేడు గురువారం రాయకుదురు గ్రామంలో జరిగిన “జగనన్న ఆరోగ్య సురక్ష” కార్యక్రమం లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పాల్గొని అక్కడ ప్రజలు ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకొని .. మనమంతా సీఎం జగన్ కుటుంబ సభ్యులుగా ఉచితంగా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని ప్రభుత్వ సేవలను సదివినియోగం చేసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *