సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెల్లూరు నగరంలో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేడు, శనివారం రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతి శ్రీనివాస వర్మ ప్రారంభించారు. వీఆర్సీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కేంద్రమంత్రి పరిశీలించి ఆపై నిర్వాహకులతో ముచ్చటించారు. శ్రీనివాస వర్మ మాట్లాడుతూ..సేంద్రియ పద్దతుల ద్వారా ఆర్గానిక్ చేపల పెంపకం అన్ని రకాలుగా రైతులకు ఇటు ప్రజల ఆరోగ్యానికి రుచికి మంచిదని తెలిపారు. యాంటీ బయోటిక్స్ లేకుండా సహజ పద్దతులలో పెరిగిన చేప తినడం వలన అనేక అనారోగ్యలకు మంచిదని, చేప నూనె అనేక మందులలో వినియోగిస్తారన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వము మత్స్యకారులకు ప్రోత్సాహకంగా పీఎం మత్స్య సంపద యోజన ద్వారా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామన్నారు. సోమిరెడ్డి చేసిన నెల్లూరు మత్యకారుల కోసం చేసిన అభ్యర్ధనల ను కేంద్ర మత్స్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.
