సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలలో శ్రీ వినాయక చవితి సందడిని కొంతమేర అడ్డుకోయ్ అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. భారీ వర్షాల కారణంగా.. పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై నీరు చేరడంతో.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. మరోసారి హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ(బుధవారం) రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.మరో 2 రోజులు పాటు అల్ప పీడన ప్రభావం ఉంటుంది. కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. సముద్ర తీరం వెంబడి 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ మేరకు మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *