సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం శతాధిక ఏళ్ళు గా దేశంలో పాతుకొనిపోయిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ చరిత్రలో అరుదయిన ఘటన లిఖితమైంది. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం లో కనుమరుగైపోతున్న కాంగ్రెస్ పార్టీ కి జవసత్వాలు తీసుకొనిరావడానికి దేశవ్యాప్తం పాదయాత్ర చేస్తున్న పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మొదటిసారి గురువారం నేడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొన్నారు. చాలాకాలంగా అనారోగ్యంతో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సోనియాగాంధీ మాండ్యాలో భారీ స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు వెంటరాగా తనయుడు రాహుల్ తో కొంత దూరం ఉత్సహంగా కలిసి నడిచారు. దీనికి ముందుగా సోనియా పాదాలకు రాహుల్ స్వయంగా బూట్లు తొడిగి లేసులు కట్టడం అందరిని ఆకట్టుకొంది. గత బుధవారం బేగూర్ గ్రామంలో ని దేవాలయాన్ని సోనియా సందర్శించారు. సోనియా గాంధీ మైసూరు రాకతోపాటు ఆయుధ పూజ, విజయదశమి సందర్భంగా గత రెండు రోజులపాటు విరామం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *