సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో బీజేపీ గెలుపు కోసంఓట్ల చోరీ జరిగిందంటూ సంచలన ఆరోపణలు, ఆధారాలు అంటూ సంచలన రీతిలో ప్రదర్సన తో ఉద్యమిస్తున్న రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం తాజాగా సవాలు విసిరింది. ఈ ఆరోపణలను ప్రస్తావిస్తూ ఓ డిక్లరేషన్‌పై సంతకం చేసి విడుదల చేయాలని రాహుల్ గాంధీకి తేల్చి చెప్పింది. లేని పక్షంలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సూచించింది. రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారమని, ఓటర్లను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఈసీ పేర్కొంది.డిక్లరేషన్ విడుదల చేయకపోతే రాహుల్ గాంధీకి తన వ్యాఖ్యలపై నమ్మకం లేనట్టు భావించాల్సి వస్తుందని ఈసీ పేర్కొంది.భారత్‌లో ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకమని, అవకతవకలు జరగకుండా అనేక రక్షణ వ్యవస్థలు ఉన్నాయని పేర్కొంది. అయితే ఈసీ కి జరిగిన ఓట్ల చోరీపై ఎన్ని పిర్యదులు చేసిన పట్టించుకోలేదని, కనీసం పోలింగ్ బూత్ లలో వీడియో ఫుటేజ్ ఇవ్వడానికి కూడా ఈసీ అంగీకరించడం లేదని రాహుల్ వాదన
