సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుమలగా ప్రసిద్ధి పొందిన ద్వారకా తిరుమల, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో హుండీల లెక్కింపు ద్వారా ఈ సీజన్లో రికార్డు స్థాయిలో భారీ ఆదాయం వచ్చింది.. గడచిన 34 రోజుల కాలానికి శ్రీవారికి నగదు రూపేణా రూ.3.40 కోట్ల ఆదాయం లభించినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ప్రమోద కల్యాణమండప ఆవరణలో గత మంగళవారం హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహిం చారు. 3,40,45,080 రూపాయల నగదుతో పాటు భక్తులు సమర్పించిన కానుకల రూపేణా 567 గ్రాముల బంగారం, 12.375 కేజీల వెండి లభించినట్లు ఈవో వివరించారు. రద్దయిన పాతనోట్లు రూ.500 (50), 1000 (8)తో పాటుగా విదేశీ కరెన్సీ కూడా లభించింది.
