సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్ల వారం వారీ గడువు ముగియడంతో నేడు గురువారం (జులై 4న) కూడా రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి. దీంతో మార్కెట్లు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఐటీ షేర్లు అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. ఆ క్రమంలో బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ 80,375 వద్ద రికార్డు స్థాయికి చేరుకొంది. నేటి గురువారం ఉదయం 326 పాయింట్లు పెరిగి 80,336 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ50 తాజా జీవితకాల గరిష్ఠ స్థాయి 24,401ని తాకింది. 96 పాయింట్లు పెరిగి 24,382 స్థాయిల వద్ద ట్రేడవుతోంది. దీంతోపాటు బ్యాంక్ నిఫ్టీ 268 పాయింట్ల లాభంతో 53,357 వద్ద రికార్డు స్థాయిలో మొదలైంది. తాజగా .. టాప్ 5 గెయినర్ స్టాక్స్: HCL టెక్, ICICI బ్యాంక్, HDFC లైఫ్, టాటా మోటార్స్, హిందాల్కో కాగా టాప్ 5 లూజర్ స్టాక్స్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్‌ప్రైస్, సిప్లా, టైటాన్ కంపెనీ లు నమోదు అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *