సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా గుడ్ న్యూస్ ప్రకటించారు. కీలక వడ్డీ రేట్లను(RBI Interest Rates) మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్టు పేర్కొంది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చింది. అయితే.. ఈ ఏడాదిలో ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాంజా ప్రకటించింది ఆర్బీఐ. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో కీలక వడ్డీరేట్లపై 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఆ తర్వాత జూన్ నెలలో మరోసారి ఏకంగా 50 పాయింట్ల మేర కోత విధించింది. దీంతో 2025 ఏడాదిలోనే మొత్తం రెపో రేటు 1.25 మేర తగ్గింది.
