సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుమల లడ్డు లో జంతు కొవ్వులు లేవని CBI స్వష్టమైన ‘తాజా రిపోర్ట్ ఇచ్చినప్పటికీ .. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan ) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఎవరైనా సున్నిత అంశాలపై చాలా ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. అప్పట్లో NDDB నివేదికను సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావించారు. అందులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నిత అంశమని పేర్కొన్నారు. దేవుని ఫై మాట్లాడేటప్పుడు మేము పర్యవసానాలు ఆలోచించే ముందుకెళ్తామని రాజకీయ లబ్ధి కోసం మాట్లాడాల్సిన అవసరం ఏముందని పవన్ ప్రశ్నించారు. భగవంతుడిపైనా వైసీపీ పగబట్టిందని ధ్వజమెత్తారు. ‘అన్ని నివేదికలు.. ప్రసాదంలో వాడిన పదార్థాల్లో నెయ్యి లేదని నిర్ధారించాయి. ఎన్డీడీబీ జంతుకొవ్వు అవశేషాలు నిర్ధారిస్తే, తమ వద్ద అలాంటి పరీక్ష చేసే సామర్థ్యం లేదని ఎన్డీఆర్ఐ చెప్పింది. దేవుడి విషయాన్ని రాజకీయం చేయకూడదనే నిష్ఠతో వ్యవహరిస్తూ వస్తున్నాం. 2022లోనే కల్తీ నిర్ధారణ అయ్యింది. అయినా అయోధ్యకు అవే కల్తీ లడ్డూలు పంపి మహా పాపం చేసారు. ప్రజలకు వాస్తవాలు చెప్పకుంటే అది ఇంకా పెద్ద తప్పు అవుతుందనే నిజాలు బయటపెడుతున్నాం వైసీపీ వాళ్ళు పాపానికి ఒడిగట్టారు’ అని పవన్ కల్యాణ్ తనదయిన తరహా వ్యాక్యలు చేసారు. ( అయితే సీఎం చంద్రబాబు ఎక్కడ మరోసారి జంతు కొవ్వులు కలిశాయని వ్యాఖ్యానించకపోవడం గమనార్హం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *