సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ విశ్వ నగరం గా ఎదిగిపోతుందని అక్కడ స్థిరాస్తి ఉంటె మంచిదని ఏడాది ఏడాదికి విలువ తెగ పెరిగిపోతుందని .. కొందరి రాజకీయ పెద్దల ప్రోద్భలంతో ఎకరం భూమి 100 కోట్లు అంటూ కూడా.. కొందరు రియల్ ఎస్టేట్ వారు బోడిగుండు కు మోకాలికి ముడి పెట్టి చేసే హడావిడి మోసాలు గురించి అనుభవించిన వారికీ తెలుసు.. . తాజగా ఆ లిస్ట్ లో జగపతి బాబు చేరారు. టాలీవుడ్ ‘అగ్ర నటుడు’ జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్థిరాస్తి (రియల్‌ ఎస్టేట్‌) రంగానికి సంబంధించి తానూ మోసపోయానని తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించారు. వాళ్ల ట్రాప్​లో ఎవరూ పడకూడదని జగపతి బాబు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జగపతి బాబు ఓ పోస్ట్ పెట్టారు. ఇటీవల నేను ఓ రియల్‌ ఎస్టేట్‌ యాడ్‌లో నటించా. వారు నన్నూ మోసం చేశారు. వారెవరు?, ఏం జరిగింది? అన్నది త్వరలోనే మీకు చెబుతా. ల్యాండ్‌ కొనేముందు రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోండి. ఎవరి ట్రాప్​లో మీరు పడకండి’ అని జగపతి బాబు సూచించారు. జగపతి బాబు ఎలా మోసపోయారు అన్నది త్వరలో వెలుగులోకి రానుంది. ప్రస్తుతం పుష్ప 2, మిస్టర్‌ బచ్చన్‌, సలార్ 2 చిత్రాల్లో జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *