సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో బాధితులయిన ప్రజలు కోసం అన్ని రంగాల నుండి దాతలు, సినీ పరిశ్రమ వారు, విద్యాసంస్థలు పెద్ద ఎత్తున తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. కరోనా సమయం నుండి దేశంలో ఆపదలో ఎవరు ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే సినీ విలన్, రియల్ హీరో సోనూసూద్ సైతం తెలుగు రాష్ట్రాల కోసం ముందుకొచ్చారు. వరద బాధితుల కోసం ఆహారం, నీరు, మెడిసన్స్ అందిస్తున్నట్లు చెప్పారు. సినిమాలలో విలన్ వేషాలు వేస్తె ఆయనకు ‘ఎన్ని లక్షలు ‘ఇస్తారో తెలియదు కానీ.. తెలుగు రాష్ట్రాల బాధితుల కోసం ఏకంగాతెలుగు హీరోల స్థాయి కన్న ఒకడుగు ముందుకు వేసి ‘2 కోట్ల విరాళం‘ ఇచ్చి తన విశాల హృదయం చాటుకొన్నారు. ఈ మేరకు ఆయన సోను సుడ్ ఎక్స్‌లో తాజా పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాలు వరదలతో యుద్ధం చేస్తున్నాయని, ఇలాంటి సమయంలో వారికి తాము తమ టీమ్ అండగా ఉంటామని సోనూసూద్ వీడియోలో పేర్కొన్నారు. సాయం కోరుకునే వారు సోనూసూద్ చారిటీ ఫౌండేషన్ ఈ మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని చెప్పారు. మెయిల్‌లో సంప్రదించాలన్నారు. దీనికి ముచ్చట పడిన సీఎం చంద్రబాబు సోనూసూద్(SonuSood) సాయం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలని ఉన్న ఆయన నిబద్ధత స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. సోనూసూద్ సాయం ప్రజలకు ఓదార్పునిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
