సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే చాలు.. అభిమానులకు పండుగే.. అయితే ఇటీవల ఆయన సినిమాలు కూడా రి రిలీజ్ లలో కలెక్షన్స్ దుమ్ము దులిపేస్తూ కొత్త సినిమాలకు పోటీగా కలెక్షన్స్ లో రికార్డ్స్ నెలకొల్పుతున్నాయ్. ఇటీవల వచ్చిన 5 మహేష్ బాబు రి రిలీజ్ సినిమాలు 5 కోట్ల నుండి 11 కోట్ల వరకు వసూళ్లు చేసి తెలుగు హీరోలలో ‘సరిలేరు నీకెవ్వరూ’ అని పించాయి. ఆఖరికి భీమవరం బ్రాండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో’ఖలేజా’ సినిమా 14 ఏళ్ళ క్రితం రిలీజ్ అయ్యి అనుకున్న విజయం సాధించాక నిర్మాతను నష్టాలు పాలు చేసింది. అయితే టీవీలలో మాత్రం 1500 సారులు ప్రదర్శితమైన తోలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. మరి అప్పట్లో వచ్చిన నష్టాన్ని ఇప్పడు రి రిలీజ్ లో నిర్మాతకు లాభాల పంటలో ఖలేజా చూపించింది. అది కూడా ప్రపంచ వ్యాప్తంగా కేవలం 3 రోజులకే 11 కోట్ల పైగా కలెక్షన్స్ సాధించి మహేష్ బాబు అంటే అభిమానులకు ఎంత క్రేజ్ ఉందొ నిరూపించింది. ఇక ఈ ఖలేజా భీమవరం మినీ మహాలక్ష్మి , విజయలక్ష్మి థియేటర్స్లో2 రోజులు పాటు ప్రదర్శితమై 3లక్షల 20 వేలు గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం.
