సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రజనీకాంత్ హీరోగా రోబో సినిమా వరకు విజయపరంపర కొనసాగించిన అగ్ర దర్శకుడు శంకర్ తరువాత తడబడుతున్నాడు. స్నేహితులు ప్లాప్, రోబో 2 యావరేజ్, ఐ యావరేజ్ సినిమాల తరువాత ఇటీవల భారతీయుడు ఆయన కెరీర్ లోనే ఘోర పరాజయాన్ని అందించింది. అయితే అగ్ర నిర్మాత దిల్ రాజు తన బ్యానర్లో 50వ సినిమాగా 3 ఏళ్ళు కస్టపడి పనిచేసి రిలీజ్ చేస్తున్న ‘గేమ్ చేంజెర్’ సినిమా కు శంకర్ దర్శకుడు కావడం తో ప్రస్తుతం అంచనాలు కొంత తగ్గాయనే చెప్పాలి. అయినప్పటికీ శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న పొలిటికల్ యాక్షన్‌థ్రిల్లర్ కావడంతో, ద్విపాత్రాభినయనం చేస్తుండటంతో హిట్ టాక్ వస్తే మాత్రం రికార్డ్స్ దుమ్ము దూలపడం ఖాయం.. కియారా అడ్వాణీ, శ్రీకాంత్, ఎస్.జే.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదలపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. సంక్రాంతి కానుకగా సినిమాను వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజగా ఓ పోస్టర్ విడుదల చేశారు. మొదట ఈ సినిమాను క్రిస్‌మ్‌సకు విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే.
