సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తాడేపల్లి లోని నివాసం లో వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన వరుసగా జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశలులో క్యాడర్ లో జోష్ పెంచాలా కీలక నిర్ణయాలు తీసుకొంటున్నారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, మునిసిపల్ చైర్మెన్ లు, ZPTC, MPTCలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రీజినల్ కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఏడాది పూర్తీ అయినా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, పలు సంక్షేమ పధకాలను నిర్వీర్యం చెయ్యడం ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు పిలుపునిచ్చా రు. రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యా నిఫెస్టో.. పేరుతో కార్య క్రమాన్ని నిర్వ హిం చాలని నిర్ణయించారు. ఐదు వారాలపాటు కార్య క్రమాన్ని కొనసాగించాలని.. చంద్రబాబు ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చారని ఆ మోసాలన్నీ క్యూ ఆర్ కోడ్ రూపం లో ఇంటింటికీ చేర్చాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, అందుకే తన పర్యటనలకు ఎక్కడకు వెళ్లిన ఇసుకవేస్తే క్రింద రాలనంత ప్రజలు వస్తున్నారని జగన్ బలంగా క్యాడర్ మీటింగ్లో అభిప్రాయ పడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్ప ష్టమైన తేడా ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దీని కోసం ఓ కొత్త తరహా కార్య క్రమాన్ని కూడా డిజైన్ చేశారు. దీని కోసం ఓ క్యూ ఆర్ కోడ్ విధానాన్ని కూడా డిసైన్ చేశారు. దానిని స్కా న్ చేస్తే చాలు.. ఏ గ్రామానికి ఎంత నష్టం జరిగింది అనే వివరాలు తెలిసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జులు ప్రజా సమస్యలపై పోరాడాలి. దిశానిర్దేశం చేశారు. మొత్తానికి తాను ఇకపై జనాల్లోనే ఉంటాను.అని పార్టీ శ్రేణులకు భరోసాఇచ్చారు జగన్
