సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల యువత శ్రద్దగా చదువుకోవడం, తిండి తినడం మానేస్తున్నారేమో, కాని రీల్స్ చూడటం, లేదా వాటికోసం ప్రాణాలు పణంగా పెట్టి పనికిమాలిన సాహసాలు చేయడం మాత్రం ఆపడం లేదు . వారి కుటుంబాలకు తీవ్ర విషాదాలు నింపుతున్నారు. ..తాజాగా ఇలానే ఇన్‌స్టా రీల్స్ చేసే క్రమంలో కడపకు చెందిన ఐదుగురిలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.నిన్న ఆదివారం ఐదుగురు యువకులు సరదాగా రీల్స్ చేసుకునేందుకు నగర శివారు ప్రాంతంలోని వాటర్ గండి ప్రాంతానికి వెళ్లారు. అక్కడున్న నీటిలో దిగి రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు.ఈ క్రమంలో నీటి ప్రవాహం పెరగడంతో ఐదుగురిలో ముగ్గురు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. అది గమనించిన అక్కడే ఉన్న ఒక గజఈతగాడు ఒక యువకుడిని కాపాడాడు. కానీ మిగతా ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు గజఈతగాళ్ళు రాత్రి వరకు వెతికినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో.. నేటి సోమవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టి కొట్టుకుపోయిన ఇద్దరు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. మృతులు అశోక్ నగర్‌కు చెందిన గెంటెన్ రోహిత్, కామినేని నరేష్ గా పోలీసులు గుర్తించారు.
